---Advertisement---

WAQF Amendment Bill 2025 in Telugu : Benefits of the bill Hopeful

By: tetdscexams

On: April 13, 2025

Follow Us:

WAQF Amendment Bill 2025 in Telugu
---Advertisement---

WAQF Amendment Bill 2025 in Telugu: వక్ఫ్ (సవరణ) బిల్లు – 2024 వివరణ

WAQF Amendment Bill 2025 in Telugu:  WAQF Amendment Bill 2025 in Telugu వక్ఫ్ బోర్డు కార్యకలాపాల క్రమబద్దీకరణ మరియు వక్ఫ్ ఆస్తుల సమర్థ నిర్వహణ లక్ష్యంగా 2024, ఆగస్టు 8న వక్ఫ్ (సవరణ) బిల్లు – 2024, ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు – 2024 అను రెండు బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టారు. వక్ఫ్ ఆస్తుల క్రమబద్దీకరణ, నిర్వహణలోని సమస్యలు, సవాళ్ల పరిష్కారం కోసం వక్ఫ్ చట్టం – 1995లో సవరణలు చేసే లక్ష్యంతో వక్ఫ్ (సవరణ) బిల్లు – 2024 ను రూపొందించారు. ఈ సవరణ బిల్లు భారత్లో వక్ఫ్ ఆస్తుల పరిపాలన, నిర్వహణను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుంది.

దీని లక్ష్యాలు క్రింది విధంగా ఉన్నాయి :

  • మునుపటి చట్టంలోని లోపాలను సవరించి, చట్టం పేరును మార్చడం వంటి మార్పులను చేపట్టడం ద్వారా వక్ఫ్ బోర్డుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం.
  • వక్ఫ్ నిర్వచనాలను నవీకరించడం.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరచడం.
  • వక్ఫ్ రికార్డుల నిర్వహణలో సాంకేతిక వినియోగాన్ని పెంచడం.

వక్ఫ్ సవరణ 2024 బిల్లు గురించి అవగాహన పొందడానికి తరచుగా అడిగే క్రింది ప్రశ్నలు సహాయపడతాయి :-

1) భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ బాధ్యత గల పరిపాలనా సంస్థలు ఏవి, వాటి పాత్ర ఏమిటి?
భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ ప్రస్తుతం వక్ఫ్ చట్టం – 1995 పరిధిలో ఉంది. దీని అమలు, నియంత్రణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. –

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వక్ఫ్ చట్టం – 1995 ప్రస్తుతం వక్ఫ్ ఆస్తులను నియంత్రిస్తోంది. ప్రధాన పరిపాలన సంస్థలు – వక్ఫ్ నిర్వహణలో ప్రమేయం గల ప్రధాన పరిపాలన సంస్థల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

  •  సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ (సీడబ్ల్యూసీ) – వక్ఫ్ ఆస్తుల విధానం గురించి ప్రభుత్వానికి, రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు సలహాలు, సూచనలు చేస్తుంది కాని వక్ఫ్ ఆస్తులపై ప్రత్యక్ష నియంత్రణ కలిగి లేదు.
  • రాష్ట్ర వక్ఫ్ బోర్డులు (ఎస్ఓ డబ్ల్యూబీలు) – ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి.
  • వక్ఫ్ ట్రిబ్యునల్స్ – వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ఉన్న ప్రత్యేక న్యాయ సంస్థలు.

ఈ వ్యవస్థ వక్ఫ్ సమస్యల మెరుగైన నిర్వహణ, వేగవంతమైన పరిష్కారాలకు భరోసా ఇస్తుంది. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న చట్టపరమైన మార్పులు వక్ఫ్ పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, జవాబుదారీగా మార్చాయి.
2) వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సమస్యలు ఏమిటి? WAQF Amendment Bill 2025 in Telugu Problems

i. వక్ఫ్ ఆస్తులను రద్దు చేయలేకపోవడం 
“ఒకసారి వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటే, ఎల్లప్పుడూ వక్ఫ్ ఆస్తిగానే ఉంటుంది” అనే సూత్రం వలన బెట్ ద్వారక దీవుల గురించిన వాదనలు వంటి అనేక వివాదాలకు దారితీసింది. న్యాయస్థానాలు కూడా ఈ విషయంలో ఏమీ తేల్చలేకపోతున్నాయి.

ii. చట్టపరమైన వివాదాలు, పేలవమైన నిర్వహణ: వక్ఫ్ చట్టం – 1995, 2013లో చేసిన సవరణలు ప్రభావవంతంగా లేవు. వీటిలో గల కొన్ని సమస్యలు –

  • వక్ఫ్ భూములను అన్యాయంగా ఆక్రమించడం
  • నిర్వహణ లోపం, యాజమాన్య వివాదాలు
  • ఆస్తుల రిజిస్ట్రేషన్, సర్వేల్లో జాప్యం
  • మంత్రిత్వ శాఖకు అధిక సంఖ్యలో వ్యాజ్యాలు, ఫిర్యాదులు

iii. న్యాయపరమైన పర్యవేక్షణ లేకపోవడం

  • వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఉన్నత న్యాయస్థానాల్లో సవాలు చేయలేకపోవడం.
  • పై కారణాల వల్ల వక్ఫ్ నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తగ్గుతుంది.

iv. వక్ఫ్ ఆస్తుల సర్వే అసంపూర్తిగా నిర్వహించడం

  • సర్వే కమీషనర్ కార్యాచరణ పేలవంగా ఉండడం జాప్యానికి కారణమవుతోంది.
  • గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సర్వే ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
  • ఉత్తర్ ప్రదేశ్ 2014లో ఆదేశించిన సర్వే ఇంకా పెండింగ్లోనే ఉంది.
  • నైపుణ్యాల లేమి, రెవెన్యూ శాఖతో సమన్వయ లోపం కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నెమ్మదించింది.

5. వక్ఫ్ చట్టాల దుర్వినియోగం (WAQF Amendment Bill 2025 in Telugu)

  • కొన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు వారి అధికారాలను దుర్వినియోగం చేయడం సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసింది.
  • వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ని దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడం చట్టపరమైన పోరాటాలు, అశాంతికి కారణమవుతోంది.
  • 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు గానూ, 8 రాష్ట్రాలు మాత్రమే సెక్షన్ 40 ప్రకారం 515 ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించినట్లు సమాచారాన్ని అందించాయి.

6. వక్ఫ్ చట్టానికి రాజ్యాంగపరమైన ఆమోదం ??

  • వక్ఫ్ చట్టం ఒక మతానికి మాత్రమే వర్తిస్తుంది. ఇతర మతాలకు ఇలాంటి చట్టం లేదు.
  • వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధమైనదా కాదా అని ప్రశ్నిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఒక పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలైంది. ఈ అంశంపై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

3) బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిత్వ శాఖ ఏయే చర్యలు తీసుకుంది, ఏయే సంబంధిత సంస్థలను సంప్రదించింది? WAQF Amendment Bill 2025 in Telugu

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింది విషయాలను గురించి సంబంధిత సంస్థలను, వ్యక్తులను సంప్రదించింది – వాటిలో సచార్ కమిటీ నివేదిక, ప్రజాప్రతినిధులు లేవనెత్తిన ఆందోళనలు, వక్ఫ్ చట్టం నిర్వహణ లోపం, అధికార దుర్వినియోగం గురించి మీడియా, సాధారణ ప్రజలను సంప్రదించడం, వక్ఫ్ సంస్థలు వక్ఫ్ ఆస్తులను తగిన విధంగా ఉపయోగించకపోవడం వంటివి ఉన్నాయి. రాష్ట్ర వక్ఫ్ బోర్డులను సైతం మంత్రిత్వ శాఖ సంప్రదించింది.

మంత్రిత్వ శాఖ వక్ఫ్ చట్టం – 1995లోని నిబంధనల సమీక్ష ప్రక్రియను ప్రారంభించి, సంబంధిత సంస్థలు, వ్యక్తులతో సంప్రదింపులు జరిపింది. 20.07.23న ఢిల్లీలో, అలాగే 24.07.23 తేదీన లక్నోలో నిర్వహించిన సమావేశాల్లో క్రింది వాటిలో చాలా సమస్యలను గురించి వివరంగా చర్చించారు. వక్ఫ్ ద్వారా ప్రభావితమయ్యే సంబంధిత సంస్థలు, వ్యక్తులు సమస్యల పరిష్కారం కోసం చట్టంలో తగిన సవరణలు చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.

  • సీడబ్ల్యూసీ (సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్), ఎస్ డబ్ల్యూబీ (స్టేట్ వల్ఫ్ బోర్డ్ ల నిర్మాణాన్ని విస్తృతం చేయడం
  • ముతవల్లీల పాత్ర, బాధ్యతలు
  • ట్రిబ్యునళ్ల పునర్నిర్మాణం .
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరచడం
  • చట్టబద్ధమైన యాజమాన్య హక్కుల ప్రకటన
  • వక్ఫ్ ఆస్తుల సర్వే
  • వక్ఫ్ ఆస్తుల మ్యుటేషన్
  • ముతవల్లీల ద్వారా అకౌంట్స్ దాఖలు
  • వార్షిక అకౌంట్స్ దాఖలులో సంస్కరణలు
  • కాందిశీకుల ఆస్తి/పరిమితి చట్టం సంబంధిత నిబంధనలు సమీక్షించడం
  • వక్ఫ్ ఆస్తుల శాస్త్రీయ నిర్వహణ

ఇంకా, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, ఈజిప్ట్, కువైట్, ఒమన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ వంటి ఇతర దేశాల్లో అమలవుతున్న అంతర్జాతీయ వక్ఫ్ నిర్వహణ పద్ధతులను కూడా మంత్రిత్వ శాఖ విశ్లేషించింది. అలాగే ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, ఏర్పాటు చేసిన సంస్థలు వక్ఫ్ ఆస్తుల నియంత్రణ బాధ్యతలు కలిగి ఉన్నట్లు గుర్తించింది.

WAQF Amendment Bill 2025 in Telugu

4. వక్ఫ్ సవరణ బిల్లు – 2024ను ప్రవేశపెట్టిన ప్రక్రియ ఏమిటి? WAQF Amendment Bill 2025 in Telugu

  • వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిపాలనలో లోపాలను పరిష్కరించే ప్రాథమిక లక్ష్యంతో 2024, ఆగస్టు 8న వక్ఫ్ సవరణ బిల్లు – 2024 ను ప్రవేశపెట్టారు.
  • పార్లమెంటు ఉభయసభలు 2024, ఆగస్టు 9న ఈ బిల్లును పరిశీలించి, నివేదిక అందించాలని 21 మంది లోక్ సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీకి సూచించాయి
  • బిల్లు ప్రాముఖ్యతను, దానికి సంబంధించిన విస్తృత భావనలను దృష్టిలో ఉంచుకుని, పైన పేర్కొన్న బిల్లులోని నిబంధనలపై సాధారణ ప్రజలు, నిపుణులు/సంబంధిత వ్యక్తులు అలాగే సంబంధిత సంస్థల అభిప్రాయాలను సేకరించాలని కమిటీ నిర్ణయించింది.
  • సంయుక్త పార్లమెంటరీ కమిటీ 36 సార్లు సమావేశమైంది. దీనిలో భాగంగా వారు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయం, చట్టం, రైల్వేలు (రైల్వే బోర్డు), గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, సంస్కృతి (ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) వంటి వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల ప్రతినిధులు, నిపుణులు/సంబంధిత వ్యక్తుల అభిప్రాయాలు/సూచనలను విన్నారు.
  • మొదటి సమావేశం 2024, ఆగస్ట్ 22న జరిగింది. ఈ సమావేశంలో కింది ప్రధాన సంస్థలు / సంబంధిత విభాగాలతోసంప్రదింపులు నిర్వహించారు.
  • ఆల్ ఇండియా సున్నీ జామియతుల్ ఉలామా, ముంబయి
  • ఇండియన్ ముస్లిమ్స్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఐఎమ్సీఆర్), న్యూఢిల్లీ
  • ముత్తాహెదా మజ్లిస్-ఇ- ఉలేమా, జమ్మూ కాశ్మీర్ (మిర్వైజ్ ఉమర్ ఫరూక్)
  • జకాత్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా
  • అంజుమన్ ఇ షిటేలి దావూది బోహ్రా కమ్యూనిటీ
  • చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ, పాట్నా
  • ఆల్ ఇండియా పస్మాందా ముస్లిం మహాజ్, ఢిల్లీ
  • ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎమ్ఎపిఎల్బి), ఢిల్లీ
  • ఆల్ ఇండియా సూఫీ సజ్జదనాషిన్ కౌన్సిల్ (ఏఐఎస్ఎస్సీ), అజ్మేర్
  • ముస్లిం రాష్ట్రీయ మంచ్, ఢిల్లీ
  • ముస్లిం మహిళా మేధావుల సంఘం – డాక్టర్ షాలిని అలీ, జాతీయ కన్వీనర్
  • జామియత్ ఉలామా-ఇ-హింద్, ఢిల్లీ
  • షియా ముస్లిం ధరమ్ గురు, మేధావుల సంఘం
  • దారుల్ ఉలూమ్ దేవ్ బంద్
  • కమిటీ భౌతిక, డిజిటల్ మాధ్యమాల ద్వారా మొత్తం 97,27,772 విజ్ఞాపనలు అందుకుంది.
  • వక్ఫ్ సవరణ బిల్లు – 2024 ను క్షుణ్ణంగా సమీక్షించడానికి గానూ, కమిటీ దేశంలోని అనేక నగరాల్లో వివరణాత్మక అధ్యయన సందర్శనలు నిర్వహించింది. సభ్యులు సంబంధిత వ్యక్తులతో పరస్పరం చర్చించడానికి, క్షేత్రస్థాయి వాస్తవాలను అంచనా వేయడానికి, వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి ఈ సందర్శనలు సహాయపడ్డాయి. 10 నగరాల్లో అధ్యయన సందర్శనల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
  • 2024, సెప్టెంబరు 26 – అక్టోబరు 1: ముంబయి, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు
  • 2024, నవంబరు 09 – 11: గౌహతి, భువనేశ్వర్
  • 2025 జనవరి 18 – 21: పాట్నా, కోల్కతా, లక్నో
  • పరిపాలనాపరమైన సవాళ్లు, చట్టపరమైన అవరోధాలను గురించి చర్చించడానికి కమిటీ 25 రాష్ట్రాల వక్ఫ్ బోర్డులను (ఢిల్లీలో 7, సందర్శనల సమయంలో 18) సంప్రదించింది.
  • ఆ తరువాత, సంయుక్త కమిటీ 2025 జనవరి 27న నిర్వహించిన 37వ సమావేశంలో బిల్లులోని అన్ని నిబంధనల పరిశీలనను నిబంధనల వారీగా పూర్తి చేసింది. సభ్యులు ప్రతిపాదించిన సవరణలను ఓటింగ్కు ఉంచి మెజారిటీ ఓట్లతో ఆమోదించారు.
  • ముసాయిదా నివేదికను ఆమోదించి, వారి తరపున నివేదికను సమర్పించడానికి చైర్పర్సను అధికారం ఇచ్చింది. 38వ సమావేశం 2025 జనవరి 29న నిర్వహించింది.
  • సంయుక్త కమిటీ తన నివేదికను 31.01.2025న గౌరవ లోక్సభ స్పీకర్కు సమర్పించింది. 2025, ఫిబ్రవరి 13న పార్లమెంటు ఉభయ సభల్లో దీనిని ప్రవేశపెట్టారు.

5. వక్ఫ్ సవరణ బిల్లు – 2024 లోని కొన్ని కీలక సంస్కరణలు ఏమిటి?

ఈ బిల్లు – 2024 కింద ప్రతిపాదించిన సవరణలను దేశంలో వక్ఫ్ నిర్వహణలో మెరుగైన పాలన, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టారు. ఇది వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసం క్రమబద్ధీకరించిన, సాంకేతికత ఆధారితమైన, చట్టబద్ధంగా బలమైన విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో సంబంధిత లబ్ధిదారుల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది.

i. ఏకీకృత వక్ఫ్ నిర్వహణ: వక్ఫ్ ఆస్తులను ప్రభావితం చేసే కీలక సమస్యలు కింది విధంగా ఉన్నాయి –

  • వక్ఫ్ ఆస్తుల అసంపూర్ణ సర్వే.
  • ట్రిబ్యునల్, వక్ఫ్ బోర్డుల్లో గణనీయ సంఖ్యలో వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయి.
  • ముతవల్లీల అకౌంట్లు, ఆడిటింగ్, పర్యవేక్షణ సరిగా లేవు..
  • అన్ని వక్ఫ్ ఆస్తుల మ్యుటేషన్ సరిగ్గా జరగలేదు.

ii. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల సాధికారత:
ప్రాతినిధ్యాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించడానికి నిర్ణయం తీసుకోవడంలో ముస్లిమేతరులు, ఇతర ముస్లిం వర్గాలు, ముస్లిం వర్గాల్లోని ఇతర వెనుకబడిన తరగతులు, మహిళలను భాగస్వామ్యం చేయడం.

iii. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల సామర్థ్యం:
శాస్త్రీయ, సమర్థమైన, పారదర్శక పాలన కోసం వక్ఫ్ రిజిస్ట్రేషన్, సర్వే, మ్యుటేషన్, ఆడిట్ లు, లీజింగ్, వ్యాజ్యాలను ఒక డిజిటల్ పోర్టల్, డేటాబేస్ సాంకేతికంగా నమోదు చేస్తుంది.

iv. వక్ఫ్ ల అభివృద్ధి:

  • పోర్టల్-ఆధారిత నిర్వహణ పూర్తిగా పరిపాలనను క్రమబద్దీకరిస్తుంది.
  • సెక్షన్ 65 ప్రకారం వక్ఫ్ బోర్డులు సకాలంలో చర్యలు తీసుకుంటూ నిర్వహణ, ఆదాయ వృద్ధి గురించి ఆరు నెలల్లో నివేదికలు ఇవ్వాలి.
  • సెక్షన్ 32(4) ప్రకారం వక్ఫ్ బోర్డులు అవసరమైనప్పుడు ముతవల్లీల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా వక్ఫ్ భూములను విద్యా సంస్థలు, షాపింగ్ కేంద్రాలు, మార్కెట్లు లేదా గృహాలుగా అభివృద్ధి చేయవచ్చు.

1) వక్ఫ్ బిల్లు-1995, వక్ఫ్ సవరణ బిల్లు-2024 మధ్య ముఖ్యమైన తేడాలు ఏంటి?

మెరుగైన పాలన, పారదర్శకత, వక్ఫ్ నిర్వహణలో సమ్మిళితతను లక్ష్యంగా చేసుకుని వక్ఫ్ చట్టం-1995లో పలు మార్పులను వక్ఫ్ సవరణ బిల్లు-2024 ప్రవేశపెడుతోంది. ముఖ్యమైన తేడాలు ఇలా ఉన్నాయి:

WAQF Amendment Bill 2025 in Telugu

విభాగం వక్ఫ్ చట్టం-1995 వక్ఫ్ సవరణ బిల్లు-2024
వక్ఫ్ ఏర్పాటు ప్రకటన, ఉపయోగం, దానం(వక్ఫ్-అలాల్-ఔలాద్) ద్వారా ఏర్పాటుకు అనుమతి ఉంటుంది. ఉపయోగం ద్వారా వక్ఫ్ తొలగిపోతుంది. ప్రకటన లేదా దానం ద్వారా మాత్రమే అనుమతి
ఉంటుంది. దాతలు 54 సంవత్సరాలు ఇస్లాంను ఆచరించి ఉండాలి. స్త్రీ వారసత్వాన్ని తిరస్కరించడానికి వీలు లేదు.
 వక్ఫ్ గా ప్రభుత్వ ఆస్తులు స్పష్టమైన నిబంధన లేదు. వక్ఫ్ గా గుర్తించిన ప్రభుత్వ ఆస్తులు వక్ఫ్ గా ఉండవు. వివాదంలో ఉన్న ఆస్తుల విషయంలో రాష్ట్రప్రభుత్వ పరిధిలోని కలెక్టర్ సమస్యలను పరిష్కరిస్తారు.
వక్ఫ్   నిర్ణయించే అధికారం  వక్ఫ్ బోర్డుకు ఉంది. ఈ నిబంధన తొలగిపోతుంది.
వక్ఫ్ సర్వే  సర్వే కమిషనర్లు, అడిషనల్ కమిషనర్ల ద్వారా నిర్వహిస్తారు రాష్ట్ర రెవెన్యూ చట్టాల ప్రకారం సర్వేలు నిర్వహించే
అధికారం కలెక్టర్లకు ఉంది.
కేంద్ర పక్స్   కౌన్సిల్ ఇద్దరు మహిళలతో సహా సభ్యులందరూ ముస్లింలుగా ఉండాలి. ఇందులో ఇద్దరు ముస్లిమేతరులు ఉంటారు. ఎంపీలు, మాజీ న్యాయమూర్తులు, ప్రముఖులు ముస్లింలు కానవసరం లేదు.  వీళ్లు ముస్లింలై ఉండాలి.

ముస్లిం సంస్థల ప్రతినిధులు, ఇస్లామిక్ న్యాయ పండితులు, వక్ఫ్ బోర్డు చైర్మన్లు.
ముస్లిం సభ్యుల్లో ఇద్దరు మహిళలు ఉండాలి.

రాష్ట్ర వక్ఫ్ ఎన్నికైన ఇద్దరు ముస్లిం ఎంపీలు/ఎమ్మెల్యేలు/బార్ కౌన్సిల్  సభ్యులు, కనీసం ఇద్దరు మహిళలు ఇద్దరు ముస్లిమేతరులు, పియా, సున్నీ, వెనుకబడిన తరగతులకు చెందిన ముస్లింలు, బోహ్రా, అగాఖానీల నుంచి ఒక్కొక్కరు చొప్పున బోర్డు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. కనీసం ఇద్దరు ముస్లిం
మహిళలు ఉండాలి.
ట్రిబ్యునల్ ఒక న్యాయమూర్తి నేతృత్వం ట్రిబ్యునల్ వహిస్తారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్, ముస్లిం న్యాయ నిపుణుడు ఇందులో ఉండాలి. ముస్లిం న్యాయ నిపుణుడి నిబంధన తొలగింపు. జిల్లా కోర్టు న్యాయమూర్తి (చైర్మన్), సంయుక్త కార్యదర్శి (రాష్ట్ర ప్రభుత్వం) ట్రిబ్యూనల్లో ఉండాలి.
ట్రిబ్యునల్ ఆదేశాలపై అప్పీల్ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే హైకోర్టు జోక్యం 90 రోజుల్లోగా హైకోర్టులో అప్పీళ్లకు అనుమతి.
 కేంద్ర ప్రభుత్వ  అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా వక్ఫ్ ఖాతాలను ఆడిట్ చేయొచ్చు వక్ఫ్ రిజిస్ట్రేషన్, ఖాతాలు, ఆడిట్లపై (కాగ్ లేదా నియమించిన అధికారి) నిబంధనలు రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
వివిధ వర్గాలకు  ప్రత్యేక వక్ఫ్ బోర్డులు షియా, సున్నీలకు  (షియా వక్ఫ్ >15%)  ప్రత్యేక బోర్డులు వీటితో పాటు బోహ్రా, అగాఖానీ వక్ఫ్ బోర్డుల ఏర్పాటు చేయొచ్చు. WAQF Amendment Bill 2025 in Telugu

2) సంయుక్త కమిటీ సిఫార్సు చేసిన కీలక సంస్కరణలు ఏమిటి?
వక్ఫ్ చట్టం- 1995కు సంయుక్త కమిటీ సిఫారసుల ప్రకారం వక్ఫ్ సవరణ బిల్లు-2024 (జేసీడబ్ల్యూఏలీ) ప్రగతిశీల సంస్కరణలు చేసింది. అవి:వక్ఫ్ సవరణ బిల్లు-2024లో కీలక సంస్కరణలు-

i. ట్రస్టులను వక్ఫ్ నుంచి వేరు చేయడం: ఏ చట్టం ప్రకారమైనా ముస్లింలు సృష్టించిన ట్రస్టులను ఇకపై వక్త్రగా పరిగణించరు. తద్వారా ట్రస్టులు నియంత్రణ పరిధిలోకి వస్తాయి.

ii. టెక్నాలజీ, కేంద్రీకృత పోర్టల్: ఒక కేంద్రీకృత వెబ్సైట్ రిజిస్ట్రేషన్, ఆడిట్లు, దాన వివాదాలతో సహా వక్ఫ్ ఆస్తుల నిర్వహణను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంది. ఇది సమర్థత, పారదర్శకతను అందిస్తుంది. వక్ఫ్ నిర్వహణ ఆటోమేషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించేలా చేస్తుంది.

iii. వక్ఫ్ కు దానానికి అర్హత: కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను ఆచరిస్తున్న ముస్లింలు మాత్రమే తమ సొంత ఆస్తిని వక్కు అంకితం చేయొచ్చు. 2013కు ముందు నాటి నిబంధన తిరిగి అమల్లోకి వస్తుంది.

iv. వినియోగం ద్వారా వక్ఫ్’గా గుర్తించిన ఆస్తులకు సంబంధించిన రక్షణ: వివాదాస్పదం లేదా ప్రభుత్వ భూమిగా గుర్తించినట్లైతే తప్ప ఇప్పటికే నమోదైన ఆస్తులు వక్ఫ్ గానే ఉంటాయి.

v. కుటుంబ వక్ఫ్ విషయంలో మహిళల హక్కులు: వక్ఫ్ సమర్పణకు ముందు మహిళలు హక్కుగా తమ భాగాన్ని వారసత్వంగా పొందాలి. ఈ విషయంలో వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, అనాథలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి.

vi. పారదర్శకంగా వక్ఫ్ నిర్వహణ: జవాబుదారీ కోసం ముతావలీలు ఆరు నెలల్లోగా కేంద్ర పోర్టల్లో ఆస్తుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి.

vii. ప్రభుత్వ భూమి, వక్ఫ్ వివాదాలు: అనవసరమైన వక్ఫ్ క్లెయిమ్లను నిరోధించేందుకు కలెక్టర్ స్థాయికి పైబడిన అధికారి వక్ఫ్డ్ గా పేర్కొన్న ప్రభుత్వ ఆస్తులపై దర్యాప్తు చేస్తారు.

viii. వక్ఫ్ ట్రిబ్యునళ్ల బలోపేతం: సంస్థాగత ఎంపిక ప్రక్రియ, నిర్ణీత పదవీ కాలం వల్ల వివాద పరిష్కారంలో స్థిరత్వం, సమర్థత వస్తుంది.

ix. ముస్లిమేతర ప్రాతినిధ్యం: కేంద్ర, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతర సభ్యులు ఉండటం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతుంది.

x. వార్షిక విరాళాల తగ్గింపు: వక్ఫ్ బోర్డులకు వక్ఫ్ సంస్థలు తప్పనిసరిగా అందించాల్సిన వాటాను 7% నుంచి 5%కి తగ్గించారు. తద్వారా దాతృత్వానికి ఎక్కువ నిధులు అందుబాటులో ఉంటాయి.

xi. పరిమితి చట్టం వర్తింపు: ఇప్పుడు వక్ఫ్ ఆస్తి క్లెయిమ్లకు పరిమితి చట్టం-1963 వర్తిస్తుంది. ఇది దీర్ఘకాల వివాదాలను తగ్గిస్తుంది.

xii. వార్షిక ఆడిట్ లో సంస్కరణలు: ఏడాదికి రూ.లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్న వక్ఫ్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆడిటర్ల చేత ఆడిట్ చేయించాలి.

xiii. ఏకపక్షంగా క్లెయిమ్లకు ముగింపు: ఈ బిల్లు సెక్షన్ 40ని ఈ బిల్లు తొలగించింది. తద్వారా వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్గా ప్రకటించటం, మొత్తం గ్రామాన్ని వక్ఫ్ గా ప్రకటించడం వంటి దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది.

నిరంకుశంగా, నియంత్రణ లేని అధికారాన్ని వక్ఫ్ బోర్డులు కలిగి ఉండటాన్ని ఇవి తెలియజేస్తున్నాయి. వీటి పరిష్కారం కోసం వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ని తొలగించి వక్ఫ్ ఆస్తులను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు నిబంధనలు తీసుకొచ్చారు. WAQF Amendment Bill 2025 in Telugu

3) ముస్లిమేతర ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించిన ఉదంతాలకు కొన్ని ఉదాహరణలు?

  • సెప్టెంబర్ 2024 నాటికి 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డుల గణాంకాల ప్రకారం 5,973 ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ప్రకటించారు. వీటిలో కొన్ని ఉదాహరణలు :
  • 2024 సెప్టెంబరులో గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన దాని ప్రకారం 108 ఆస్తులు భూమి, అభివృద్ధి కార్యాలయం (ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ )కు చెందినవి. 130 ఆస్తులు దిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ (దిల్లీ డెవలప్మెంట్ అథారిటీ)కి చెందినవి. ప్రజలకు సంబంధించిన 123 ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించి వివాదంలోకి నెట్టారు.
  • కర్ణాటక (1975,2020): వ్యవసాయభూములు, బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వభూములు, శ్మశానవాటికలు, సరస్సులు, దేవ లయాలతో సహా 40 వక్ఫ్ ఆస్తులను నోటిఫై చేశారు.
  • పాటియాలాలో విద్యాశాఖకు చెందిన భూమిని పంజాబ్ వక్ఫ్ బోర్డు తనదేనని చెబుతున్నది.
    వక్ఫ్ ప్రకటించిన ఇతర ముస్లిమేతర ఆస్తులకు సంబంధించిన ఉదాహరణలు:
  • తమిళనాడు: తిరుచెన్తురై గ్రామంపై వక్ఫ్ బోర్డుకు పూర్తి గ్రామాన్ని వక్ఫ్ గా క్లెయిమ్ చేయటం వల్ల ఓ రైతు తన భూమిని అమ్ముకోలేకపోయాడు. తన కుమార్తె వివాహం కోసం తీసుకున్న రుణం తిరిగి చెల్లించడానికి తన భూమిని విక్రయించకుండా ఈ క్లెయిమ్ నిరోధించింది.
  • బీహార్లోని గోవిందాపూర్ గ్రామం: 2024 ఆగస్టులో బీహార్ సున్నీ వక్ఫ్ బోర్డు మొత్తం గ్రామంపై హక్కు కలిగి ఉన్నట్లు క్లెయిమ్ చేసుకోవటం వల్ల ఏడు కుటుంబాలపై ప్రభావం పడింది. ఇది పాట్నా హైకోర్టులో కేసుకు దారితీసింది. ఈ కేసు కోర్టులో ఉంది.
  • కేరళ: 2024 సెప్టెంబర్ ఎర్నాకుళం జిల్లాలో సుమారు 600 క్రైస్తవ కుటుంబాలు తమ పూర్వీకుల భూమిపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్ను వ్యతిరేకిస్తున్నాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి వారి వాదనను వినిపించారు.
  • కర్ణాటక: 2024లో విజయపురలో 15 వేల ఎకరాలను వక్ఫ్ భూమిగా వక్ఫ్ బోర్డు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు దిగారు. బళ్లారి, చిత్రదుర్గ, యాద్గిర్, ధార్వాడ్లలో కూడా వివాదాలు తలెత్తాయి. అయితే వారిని ఖాళీ చేయించటం జరగదని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
  • ఉత్తరప్రదేశ్: రాష్ట్ర వక్ఫ్ బోర్డు అవినీతి, దుర్వినియోగంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

4) వక్ఫ్ సవరణ బిల్లు 2024 WAQF Amendment Bill 2025 in Telugu పేదలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?

ముఖ్యంగా నిరుపేదలకు స్వచ్ఛంద సేవ, సామాజిక సంక్షేమ అవసరాలను తీర్చడంలో వక్ఫ్ కీలక పాత్ర పోషిస్తోంది. అయినప్పటికీ దుర్వినియోగం, భూ ఆక్రమణలు, పారదర్శకత లేకపోవడం వల్ల దాని ప్రభావం తరచుగా తగ్గింది.

పేదలకు వక్ఫ్ వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు:

  • పారదర్శకత, జవాబుదారీతనం కోసం డిజిటలైజేషన్
  • కేంద్రీకృత డిజిటల్ పోర్టల్ వక్ఫ్ ఆస్తులను ట్రాక్ చేస్తుంది. మెరుగైన గుర్తింపు, పర్యవేక్షణ, నిర్వహణ ఉండేలా
  • చూసుకుంటుంది.
  • ఆడిటింగ్, అకౌంటింగ్ విషయంలో తీసుకుంటున్న చర్యలు ఆర్థిక దుర్వినియోగాన్ని నిరోధిస్తాయి, నిధులను సంక్షేమ
  • ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించేలా చూస్తాయి.
  • సంక్షేమం, అభివృద్ధికి ఎక్కువ ఆదాయం
  • వక్ఫ్ భూముల దుర్వినియోగం, అక్రమ ఆక్రమణలను నిరోధించడం వల్ల వక్ఫ్ బోర్డులకు ఆదాయం పెరుగుతుంది. తద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టటానికి వీలవుతుంది.
  • ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా వైద్యం, విద్య, గృహనిర్మాణం, జీవనోపాధి మద్దతుకు నిధులు కేటాయించొచ్చు.
  • క్రమం తప్పకుండా ఆడిట్’లు, తనిఖీలు ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహిస్తాయి. వక్ఫ్ నిర్వహణ విషయంలో ప్రజల నమ్మకాన్ని పెంచుతాయి.

5) వక్ఫ్ బోర్డు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులు ఉండటం అనేది వక్ఫ్ నిర్వహణకు ఎలా దోహదం చేస్తుంది? నిర్ణయాలు తీసుకోవడంలో వారి పాత్ర, ప్రభావం ఏ మేరకు ఉంటుంది?

  • ముస్లిమేతర సభ్యులు: దాతలు, కక్షిదారులు, అద్దెకు ఇచ్చిన వారు, అద్దెకు ఉన్న వారు వక్ఫ్ నిర్వహణలో భాగస్వాములుగా ఉంటున్నారు. వారి ప్రాతినిధ్యం వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ (సీడబ్ల్యూసీ)ల న్యాయబద్ధతకు అవసరం.
  • లౌకిక కార్యకలాపాల నియంత్రణ: వక్ఫ్ సంస్థల పాలన, సామాజిక, ఆర్థిక, సంక్షేమ అంశాలను నియంత్రించే అధికారాన్ని సెక్షన్ 96 కేంద్ర ప్రభుత్వానికి ఇస్తోంది.
  • కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ పర్యవేక్షణ పాత్ర: సీడబ్ల్యూసీ రాష్ట్ర వక్ఫ్ బోర్డులను పర్యవేక్షిస్తుంది. ఇది వక్ఫ్ ఆస్తులపై ప్రత్యక్ష నియంత్రణ లేకుండా ఆయా రాష్ట్రాల బోర్డులు నిబంధనలు పాటించేలా చూసుకుంటుంది. వక్ఫ్ నిర్వహణ అనేది మతపరమైన అంశాలకు ఆవల ఆర్థిక నియంత్రణ వరకు ఉంటుందని ఇది తెలియజేస్తోంది.


WAQF Amendment Bill 2025 in Telugu, వక్ఫ్ (సవరణ) బిల్లు – 2024 వివరణ, WAQF Amendment Bill 2024 pdf in Telugu, WAQF -1995,
ముస్లిమేతర ప్రాతినిధ్యం:

  • రాష్ట్ర వక్ఫ్ బోర్డులు: 11 మంది సభ్యుల్లో ఇద్దరు (ఎక్స్-అఫీషియో మినహా) ముస్లిమేతరులు కావచ్చు.
  • కేంద్ర వక్ఫ్ కౌన్సిల్: 22 మంది సభ్యుల్లో ఇద్దరు (ఎక్స్-అఫీషియో మినహా) ముస్లిమేతరులు కావచ్చు.
  • మెజారిటీ ఓటు ద్వారా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ముస్లిమేతర సభ్యులు పరిపాలనా, సాంకేతిక నైపుణ్యాన్ని అందించొచ్చు. తద్వారా వక్ఫ్ సంస్థల సమర్థత, పాలన మెరుగుపడుతుంది.

Follow us on- Facebook | YouTube | Telegram Whatsapp

---Advertisement---

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment