Dr BR Ambedkar Life History In Telugu Pdf చరిత్ర
Dr BR Ambedkar Life History In Telugu : అంబేద్కర్ జీవిత
బాల్యం : భీంరావ్ రాంజీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లో “మహు’” అన్న ఊరిలో రాంజీ మాలోజీ సక్పాల్, భీమాబాయ్ దంపతులకు జన్మించారు. అసలు పేరు భీమారావు రాంజీ అంబావడేకర్. వీరు మరాఠీ నేపథ్యం కలవారు. మహార్ కులానికి చెందినవారు. ఇతని తండ్రి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసాడు. ఆరేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది.
బాల్యం నుండీ వెంటాడిన కులవివక్ష : మెహర్లను అస్ప్రృశ్యులుగా పరిగణించడం వలన, అంబేద్కర్ చిన్నతంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు. మిగతా కులంవాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్ళు తాగాలంటే ప్యూన్ (Peon) వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్ళు తాగే అవకాశం వుండేది కాదు. ఈ దుస్థితిని అంబేడ్కర్ క్లుప్తంగా – “ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు” అని వివరించారు.
డబ్బులు చెల్లించే స్థోమత వున్నా సేవలు అందిచేవాళ్ళు ముందుకు రాకపోవడం వలన సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు. అంబేద్కర్ తొమ్మిది సంవత్సరాల వయసులో మాసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణం చేయడానికి ఎడ్లబండి వాళ్ళు ఎవ్వరూ (అస్పృశ్యులని) ముందుకురాకపోతే, బండివాడికి రెండింతలు కిరాయి ఇచ్చి బండివాడు వెనుక నడువగా అంబేడ్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకుని వెళ్లారు.
విద్యాభ్యాసం
1907లో మెట్రిక్యులేషన్ పాసయిన అంబేద్కర్ ముంబాయిలోని ఎల్ఫిన్ స్టోన్ (Elphinstone) కళాశాలలో చేరి, అది సాధించిన మొదటి వెనుకబడిన కులాల వ్యక్తిగా గుర్తింపు పొందారు. బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపారు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత బరోడా సంస్థానంలో పదేళ్ళు పనిచేసే షరతుపై 1913 లో రాజాగారి ఆర్థిక సహాయంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరి ఎం.ఏ.పిహెచ్.డి పూర్తి చేసారు. తరువాత లండన్ వెళ్ళి న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు.
దళిత మహాసభ (1927) :
1927లో మహాద్‌లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర గుజరాత్‌ల నుండి కొన్ని వేలమంది వచ్చారు. మహాద్ చెరువులోని నీటిని అంటరానివారు తాగకూడదని, చెరువులోనికి ప్రవేశించకూడదని నిషేధం ఉండేది. అంబేద్కర్ నాయకత్వంలో వేలాదిమంది ఆ చెరువులోని నీటిని తాగారు. ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది.
1927లో అంబేద్కర్ ‘బహిష్కృత భారతి’ అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు. తిలక్ గనుక అంటరానివాడుగా పుట్టివుంటే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అని ఉండడు. ‘అస్పృశ్యతా నివారణేనా ధ్యేయం, నా జన్మ హక్కు’ అని ప్రకటించి ఉండేవాడని వ్రాశారు.
గాంధీతో అభిప్రాయభేదాలు :
గాంధి వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజములో ఉన్నదని ఆయన సమర్థించారు. అయితే అంటరానివారుగా భావిస్తున్న కులాలవారు, తమ ఆత్మగౌరవమును త్యాగము చేస్తూ, సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొన్నారు. దీన్నే అంటరానితనం అనే సమస్యకు
సామాజిక, సాంస్కృతిక పరిష్కారముగా గాంధీ చూపగా, అంబేద్కర్ ఈ విషయములో గాంధీతో విభేదించారు. ఎందుకంటే తప్పు చేయకుండా ఉండే బాధ్యతను, అప్పటివరకూ తప్పు చేసే వాళ్ళ చేతుల్లోనే పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. అంటరాని కులాలు ఆర్థికముగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనిదే, వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారము దొరకదని అంబేద్కర్ భావించారు.
అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్చిన్నమవుతుందని అందుకు గాంధి ఒప్పుకోలేదు. చివరికి గాంధీకి అంబేద్కర్‌కు మధ్య పూనాలో కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత అంబేద్కర్ దళిత సమస్యల పరిష్కారానికి ఆలిండియా డిప్రెన్స్‌డ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తముగా దళితులను సమీకరించే ప్రయత్నం చేసారు.
రాజ్యాంగ రచన :
రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించిన అంబేద్కర్ అరవైకి పైగా దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసారు. దేశంలో ఏ కొత్త చట్టం వచ్చినా ప్రభావితం అయ్యేవారు కోట్లలో ఉంటారు. అందువల్ల సమస్య వచ్చాక చట్టాలను మార్చుకోవడం కంటే రాగల సమస్యలను ముందే ఊహించి, నివారణోపాయాలు కూడా పొందుపరచడం తప్పనిసరి. దానికోసమే అప్పటికే ప్రజాస్వామ్యం అమలులో ఉన్న దేశాల్లో రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఆయా దేశాలు
ఎదుర్కొన్న సమస్యలను, వాటి పరిష్కారాలను అధ్యయనం చేసి, మన దేశ పరిస్థితులకు తగినట్టుగా భారత రాజ్యాంగం తీర్చిదిద్దారు. దేశంలో పటిష్టమైన వ్యవస్థల్ని నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు అంబేద్కర్. ఏ వ్యవస్థ తప్పు చేసినా మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దే ఏర్పాటు చేశారు. ఏ వర్గాన్నీ పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు. ప్రాధమిక హక్కులతో పాటు ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేసే ఆదేశిక సూత్రాలను ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో కోటీశ్వరునికైనా, రోజు కూలీకయినా ఒక ఓటుకు ఒకటే విలువ.
సామాజిక వివక్ష గురించి బాగా తెలిసిన వ్యక్తిగా రాజ్యాంగంలో పౌరహక్కులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వాటిని న్యాయస్థానాల రక్షణ కల్పించారు. ప్రతి పౌరునికీ భావప్రకటనా స్వేచ్చను ఇస్తూ ఆర్టికల్ 19 రూపొందించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా చేశారు.
దేశంలో మత, కుల, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా జీవించే స్వేచ్చనిస్తూ దాన్ని రాజ్యాంగబద్ధం చేశారు బాబా సాహెబ్. అరికల్స్ 14, 15, 16లలో సమానత్వ హక్కులు కల్పించారు. ఇవే దశాబ్దాలుగా దేశంలో మహిళలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలకు రక్షణకవచాలుగా నిలుస్తున్నాయి.
రాజ్యాంగ రచనలో అంబేద్కర్ చాలా శ్రమించారు. డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న టి.టి.కృష్ణమాచారి ఒకసారి డ్రాఫ్టింగ్ ప్రక్రియ గురించి ఇలా మాట్లాడారు. “డ్రాఫ్టింగ్ కమిటీలోని ఏడుగురు సభ్యుల్లో ఒకరు రాజీనామా చేస్తే, అతని స్థానంలోకి ఇంకొకరిని నియమించారు. ఒక సభ్యుడు మరణించాడు. ఒక సభ్యుడు అమెరికాలో దూరంగా ఉండగా, మరొకరు అనేక ఇతర ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. మరో ఇద్దరు సభ్యులు ఢిల్లీకి దూరంగా నివాసం ఉంటూ అనారోగ్య కారణాలతో డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశాలకు హాజరు కాలేదు. చివరికి, ఈ రాజ్యాంగాన్ని రూపొందించే మెజారిటీ బాధ్యత అంబేద్కర్‌పైనే పడింది. ప్రశంసనీయమైన రీతిలో ఈ పనిని సాధించినందుకు మేము ఆయనకు కృతజ్నాలై ఉంటాము” అన్నారు కృష్ణమాచారి.
రాజ్యాంగ రచన చేయడం మాత్రమే కాకుండా, సాధారణ జనానికి అర్థం అయ్యేలా, సులువైన పదాల్లో సూచనలు చేసేవారు కూడా. ఒకసారి మాట్లాడుతూ “రాజ్యాంగంలోని ఏదైనా ప్రత్యేక ఆర్టికల్‌ను అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొనమని నన్ను అడిగితే ఆర్టికల్ 32 అంటాను. ఈ ఆర్టికల్ లేకుండా ఈ రాజ్యాంగం శూన్యమవుతుంది. ఇది రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు దాని హృదయం.” అన్నారు. ఆర్టికల్ 32 ద్వారా పౌరులు రాజ్యాంగ పరిహారపు హక్కును పొందుతారు.
అనగా ప్రాథమిక హక్కులకు ఏమాత్రం భంగం కలిగినా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఉదాహరణకు పౌరులు ఎవరైనా నిరాధారంగా జైలులో నిర్బంధించబడితే ఆ వ్యక్తి న్యాయస్థానాలను ఆశ్రయించి, ఇది దేశచట్టాలకు అనుగుణంగా వున్నదా? లేదా? అని ప్రశ్నించే హక్కును కలిగి ఉంటారు. ఒకవేళ, న్యాయస్థానం నుండి జవాబు “లేదు” అని వస్తే, ఆవ్యక్తిని తక్షణమే విడుదలచేయవలసి వస్తుంది.
భారతదేశ ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ పాత్ర: Dr BR Ambedkar Life History In Telugu
స్వాతంత్య్రం వచ్చేవరకూ భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా, సంస్థానాలుగా ఉండేది. ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది మనదేశానికి పూర్తిగా కొత్త వ్యవహారం. ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి ఆలోచించిన వారిలో అంబేద్కర్ మొదటివాడేమీ కాదు. గతంలోనూ, సమకాలీనుల్లోనూ చాలామంది ఉన్నారు. కానీ ఆ ఆలోచనలన్నీ కేవలం ఆదర్భాలతో నిండి ఉండి, ప్రణాళికాబద్దంగా లేనివి. అందుకు భిన్నంగా, ఇక్కడ ప్రజాస్వామ్యం అమలు గురించి అంబేద్కర్ చేసిన ప్రతిపాదనలు స్పష్టమైనవి, నిర్దుష్టమైనవి, నిర్మాణాత్మకమైనవి.
ఆచరణలో వచ్చే సమస్యలకు పరిష్కారాలు చూపించేవి. అంబేద్కర్ మానవ శాస్త్రవేత్త కూడా కావడం వల్ల, భారతదేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి ఉండటం వల్ల, వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ దేశంలో ఏం చేస్తే ప్రజాస్వామ్యం అమలు సాధ్యమో స్పష్టంగా తెలిసిన వ్యక్తి. స్వేచ్చ,సమానత్వం , సోదర భావం , న్యాయం అనే పునాదుల మీద తప్ప ప్రజాస్వామ్యం నిలబడదు అని తెలిసిన వ్యక్తిగా ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో చేర్చారు.
“భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పురోగమన అవకాశాలేమిటి?” అన్న ప్రశ్నకు అంబేద్కర్ ఇచ్చిన ఈ కింది సమాధానం వింటే అంబేద్కర్ ఆలోచనలు ఇంకా స్పష్టంగా అర్థం అవుతాయి.
“ఎన్నికల ద్వారా దేశాధ్యక్షుడను నియమించుకొ ంటే ఆ దేశం గణతంత్రం(రిపబ్లిక్) అవుతుంది. రిపబ్లిక్ ఉన్న ప్రతిచోటా ప్రజాస్వామ్యం వర్ణిల్లుతున్నట్టు కాదు. ప్రజాస్వామ్య మూలాలను ఆ దేశంలోని సామాజిక సంబంధాల్లో, అంటే ఏ ప్రజల వల్లనైతే సమాజం ఏర్పడుతుందో, ఆ ప్రజల మధ్య నుండే సహజీవన తీరును అనుసరించి పరిశీలించాల్సి వుంటుంది.
భారత సమాజం వ్యక్తులతో ఏర్పడింది కాదు. లెక్కలేనన్ని కులాల గుంపులతో ఏర్పడింది. కుల వ్యవస్థ వున్న చోట సామాజిక ఆదర్శాలు వుండవు. వ్యక్తులకు స్వతంత్ర ఆలోచనలు ఉండవు. కులాల కట్టుబాట్లే వాళ్ళ ఆలోచనల్ని నిర్దేశిస్తాయి. భూములు, పరిశ్రమలు, సంపద, పలుకుబడి కలిగిన కొన్ని కులాల నాయకులు వెనుకబడిన కులాల్లోని పౌరుల ఆలో ‘చనల్ని డబ్బుతో, పలుకుబడితో తమకు నచ్చినట్టు మలచుకోగలుగుతాయి. ఎవరికి ఓటు వెయ్యాలో కూడా నిర్దేశించగలుగుతాయి. వెనుకబడిన కులాలవారు ఓట్లు వేయడం తప్పు, కీలక రాజకీయ పదవుల్లోగానీ, నిర్ణయాల్లోగానీ ప్రాతినిధ్యం ఉండదు. అంటే ప్రజాస్వామ్యం అమలవుతున్నట్టు కాదు. మెజారిటీ జనాభా వెనుకబాటుతనంలో ఉండటం వల్ల దేశ అభివృద్ధి కూడా ఆగిపోతుంది.
ఈ విపత్తుని నివారించడానికే చట్టసభల్లో దళితులకు, ఆదివాసీలకు సీట్ల కేటాయింపు పద్దతి ఏర్పాటు చేయడం జరిగింది. (ప్రస్తుతం దళితులకు 84, ఆదివాసీలకు 47).
పార్లమెంటరీ ప్రభుత్వం అంటే వంశపారంపర్య పాలనకు స్వస్తి చెప్పి, ఎప్పటికప్పుడు ప్రజలచేత ఎన్నుకోబడుతూ వుండాల్సిందే. ప్రజల ఆమోదం పొంది తీరాల్సిందే. ఇది చర్చల ద్వారా నిర్వహించబడే ప్రభుత్వం. ఏ చట్టమైనా, ప్రజా జీవితానికి వర్తించే ఏ చర్య అయినా ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధుల సలహా మీదే రూపొంచాలి కానీ ఏ వ్యక్తీ తనొక సర్వాంతర్యామినని భావిస్తూ తన ఇష్టానుసారం చట్టాలను రూపొందిస్తూ ప్రభుత్వాన్ని నడిపేందుకు వీలుండదు.
పార్లమెంటరీ వ్యవస్థకు ఎన్నికలు మొదటి మూల స్తంభం అయితే, రెండవ మూల స్తంభం ప్రతిపక్షం. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం వుండదు. ప్రతిపక్షం లేకపోతే, పాలకపక్షం తీసుకునే తప్పుడు నిర్ణయాలను ప్రజల పక్షం నిలబడి ప్రశ్నించేవారే లేకపోతే, మళ్లీ ఎన్నికలు వచ్చేవరకూ ప్రజాస్వామ్యం లేనట్టే” వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు వ
“అందరినీ సమానంగా చూడాలి” అని చట్టాలు చేసినప్పటికీ, అప్పటి వరకూ కుల వివక్షను ఎదుర్కొన్న కులాల వారు, ఊరికి దూరంగా నెట్టివేయబడ్డవారు, తమ కుటుంబాల్లో తమ బందువుల్లో ఎవరూ చదువుకున్న వారు లేకపోవడం వల్ల సమాజికంగా వెనుకబాటుతనంలోనే ఉండిపోతారు. ఎప్పటికీ విద్యకు, ఉద్యోగ అవకాశాలకు, రాజకీయ పదవులకు దూరంగానే ఉండిపోయే ప్రమాదం ఉంది. అటువంటప్పుడు చట్టాల్లో తప్ప నిజజీవితంలో సమానత్వం ఉండదు.
దీన్ని రూపు మాపాలి అంటే, సామాజికంగా వెనుకబడ్డ కులాలకు కొన్ని సీట్లు కేటాయించి, ఆ సీట్లలో వారు మాత్రమే నియమించబడేలా చేయాలి. వారిని సామాజ నిర్మాణంలో ప్రాతినిధ్యం వహించేలా చెయ్యాలి. అందుకోసమే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4) మరియు 16(4) ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేలా అంబేద్కర్ కృషి చేసారు. ఈ ఆర్టికల్స్ వల్ల రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలలో విద్య, ఉద్యోగ, రాజకీయాలో 50 మరియు 51లకు నిర్ణీత సంఖ్యలో సీట్లను రిజర్వ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. రిజర్వేషన్ సిస్టం చేసే పని ఒకొక్కరిని ఒక్కోలా చూడటం కాదు. సమాజంలో ఉన్న అసమానతల్ని రూపు మాపడం.
స్త్రీల హక్కులు:
అంబేద్కర్ రూపొందించిన “హిందూ కోడ్ బిల్లు” ఉద్దేశ్యాలు: ఆస్తి పై స్త్రీ కి హక్కు, భర్త మరియు తల్లితండ్రుల నించి సంక్రమించే ఆస్తిలో వాటా. స్త్రీ తనకు నచ్చని పెళ్లి నించి బయటకు వచ్చి విడాకులు తీసుకునే హక్కు. పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనే విషయంలో స్త్రీలకు సంపూర్ణ స్వేచ్ళ, పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చు విషయంలో విడాకులు పొందిన స్త్రీలకు చెయ్యాల్సిన న్యాయం మొదలైనవి ఆ బిల్లులో ఉన్నాయి. ఈ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంతో అంబేద్కర్ న్యాయ శాఖా మంత్రి పదవికి రాజీనామా చేసారు.
అంబేద్కర్ పుట్టింది అంటరానితనం ఎదుర్కొన్న కులంలో. సమాజం ఏ మాత్రం దగ్గరకి రానివ్వని కులం. ఆనాటి కొందరి అభ్యుదయ వాదుల సహకారంతో, ఆ రోజుల్లో ఉన్నత ధనిక కులాల వారు కూడా చదవలేనంత చదువులు చదివారు. దేశానికి కావాల్సిన స్వేచ్చ, సమానత్వం, సోదరభావం, న్యాయం వంటి వాటిని సరైన దిశలో నిర్వచించి కోట్ల మందిని స్వేచ్చ వైపు నడిపించారు. కొన్ని వేల ఏళ్లుగా వివక్షలో, బానిసలుగా బతుకుతున్న ప్రజలకు ఆశాజ్యోతి అవ్వడమే కాదు వారికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకున్నారు. అణగారిన వర్గాలను బానిసత్వం అనే చీకటి నించి ఒక నెత్తురు చుక్క రాలకుండా రాజ్యాంగం మరియు హక్కుల రూపంలో వెలుగు వైపుకి నడిపించారు.
మహామేధావిగా, సంఘసంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 1956 డిసెంబరు 6 న మహాపరినిర్వాణం చెందాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా విఖ్యాతుడైన బాబా సాహెబ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ భారత్ ప్రభుత్వం ఆ మహనీయునికి ‘భారతరత్న’ అవార్డును ఇచ్చింది. పుస్తకాల రూపంలో బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన పరిశోధనా జ్ఞానాన్ని చదివిన వారు చాలా తక్కువ. ప్పుడిప్పుడే చదువుతున్నవారి సంఖ్య పెరుగుతూ ఉంది.
Dr BR Ambedkar Life History In Telugu డా బి.ఆర్.అంబేడ్కర్
- 1891: ఏప్రిల్ 14న రామ్‌జీ శక్వాల్-భామాబాయిలకు 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించారు. తండి రామ్‌జీ మిలిటరీ పాఠశాలలో టీచర్.
- 1904: రామ్‌జీ శక్వాల్ తన కుటుంబాన్నీ సతారా నుంచి ముంబాయికి మార్చారు.
- 1907: భీమ్‌రావు మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.
- 1911: మహారాజా సాయాజీరావు గైర్వాడ్ అంబేద్కర్ కళాశాల విద్య కొనసాగించటం కోసం నెలకు రూ.25 ఇవ్వడానికి వాగ్దానం చేశాడు.
- 1912: డిసెంబర్ 12న అంబేద్కర్ పెద్ద కుమారుడు యశ్వంత్ జన్మించాడు,
- 1918: ముంబయి విశ్వవిద్యాలయం నుండి అంబేద్కర్ బిఏ పరీక్ష పాసయ్యి బరోడా ఎకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగిగా చేరాడు. బరోడా మహారాజు అంబేద్కర్ విదేశాల్లో చదువుకునేందుకు సంవత్సరానికి 280 పౌండ్ల ఉపకార వేతనాన్ని మంజూరు చేశాడు. ఆయన ఉన్నత విద్య అనంతరం బరోడా రాష్ట్రంలో పదేళ్ళపాటు ఉద్యోగం చేయాలన్న నియమంపై అంబేద్కర్ సంతకం చేశాడు. స్ఫ్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో అంబేద్కర్‌కు ప్రవేశం లభించింది.
- 1916: కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ తన విశీష్ట వ్యాసం ‘భారతదేశంలో కులాలు” అనే ఆలోచనా శ్రేరక వ్యాసాన్ని సమర్పించారు. ఆంబేద్కర్ అమెరికా పదిలి (మే నెల) లండస్ స్కూల్ ఆఫ్ ఎకసమిక్స్ అండ్ పాలిటిక్స్‌లో ఎంఎస్సీ, డిఎస్సీలు చదవటానికి (అక్టోబర్) ఇంగ్లండ్ చేరుకున్నాడు. కొలంబియా విశ్వవిద్యాలయానికి డాక్టరేట్ ఊగ్రీకి సమర్పించిన ‘భారత జాతీయ ఆర్థిక వనరులు, చారిత్రక విశ్లేషణ’ అన్న పరిశోధనా వ్యాసానికి అనుమతి లభించింది.
- 1917: బరోడా ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతసం కాల పరిమితి అయిపోయినందున అంబేద్కర్ చదువును మధ్యంతరంగా ఆపివేసి భారత్ వచ్చేశాడు. మహారాజా సాయాజీరావుని కలుసుకుని బరోడా ఎకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగంలో చేరాడు. అస్పృశ్యత సృష్టించిన అవమాన సంఘటనలతో అనతి కాలంలోనే ఉద్యోగం వదిలివేసి అంబేద్కర్ ముంబయి రావలసి వచ్చింది.
- 1928: న్యాయవాదిగా పనిచేయడం (ప్రారంభించారు.
- 1927: ఫిబ్రవరి 18న ముంబయి శాసనసభ సభ్యుడిగా అంబేద్కర్ ప్రమాణ స్వీకారం చేశాడు.
- 1930: అక్టోబర్ 4న అంబేద్కర్ మొదటి రౌండ్ టేబుట్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు లండన్ వెళ్ళాడు.
- సమావేశంలోఆయన అస్పృశ్యుల (ప్రతనిధిగా నమోదయ్యాడు.
- 1981: మణిభవన్‌లో అంబేద్కర్ గాంధీజీతో అంబేద్కర్ ‘నాకు స్వదేశం ఉందని మీరంటున్నారు. మళ్ళీ చెబుతున్నాను. నాకు స్వంత దేశం లేదు. మమ్మల్ని పిల్లులు, కుక్కలకన్నా హీనంగా చూస్తుంటే ఇది నా దేశమని, ఇది నా మతమని ఎలా అనుకుంటారు. నేనే కాదు కొద్దిపాటి ఆత్మగౌరవమున్న ఏ అన్మృశ్యుడూ ఈ నేలను చూసి గర్వపడలేడు’ అన్నారు.
- 1985: అంబేద్కర్ భార్య శ్రీమతి రమాబాయి అంబేద్కర్ మే 27న ముంబయిలో మరణించారు.
- 1942: భారత్ వైస్రాయ్ గారి కార్యనిర్వాహక వర్గంలో డా॥ అంబేద్కర్‌కు స్థానం కల్పించారు. అంత పెద్ద పదవిని పొందిన తొలి అస్పృశ్యుడు ఆయనే.
- 1946: రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం జరిగింది. డా॥ రాజేంద్రప్రసాద్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
- 1948: రాజ్యాంగ ముసాయిదా ప్రతిని అంబేద్కర్ రాజ్యాంగం పరిషత్తులో చర్య కోసం సమర్పించారు. అదే సంవత్సరం డా! సవితతో వివాహం.
- 1950: స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా అంబీద్కర్ ప్రమాణ స్వీకారం.
- 1956: డిసెంబర్ 6వ లేదిన ఢిల్లీ అలీపూర్ రోడ్డులోని 26 నంబర్ ఇంటిలో డా॥ అంబేద్కర్ తుదిశ్వాస విడిచారు. లక్షలాది (ప్రజల దర్శనం… బొంబాయి-దాదర్ సము(ద్ర తీరంలో బౌద్ధమత ఆచారాలతో కుమారుడు యశ్వంత్‌చే అంతిమ సంస్కారాలు.
- 1990: డాక్టర్ అంబేద్కర్‌కు మరణాసంతరం భారత పౌర అత్యుస్పృత సత్కారం ‘భారతరత్నః ప్రధానం జరిగింది. రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ చేతు మీదుగా అంబేద్కర్ సతీమణి డా॥ సవిత (మాయి) ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

